కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం దివ్యాంగులు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నాన్ని చేపట్టారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు నెలకు 6000 రూపాయల పెన్షన్ ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని సముదాయించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వారి వినతి పత్రాన్ని అందజేశారు.