శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అధ్యక్షతన గురువారం సాయంత్రం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో ముస్లిం మత పెద్దలతో పుర ప్రముఖులతో గణేష్ నిమజ్జన ఉత్సవం పై శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జన ఉత్సవాన్ని జరుపుకుందామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.