జలదంకి మండలం అన్నవరం క్వారీలో జరుగుతున్న అక్రమాలను బయటకు తీయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ ను కలిసిన నేతలు ఆయనతో మాట్లాడారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అనుమతులు లేకుండా క్వారీ నిర్వహిస్తున్నారని, దానికి సంబంధించిన నివేదికను తెప్పించుకోవాలని వారు కలెక్టర్ ని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు వైసిపి మాజీ మంత్రి కాకాని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు