విజయనగరం జిల్లా కలెక్టర్ గా ఎస్.రామ సుందర్ రెడ్డి శనివారం ఉదయం 9:30 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. తొలిసారి కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన రామ సుందర రెడ్డికి వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం తన ఛాంబర్ లో అర్చకుల వేద మంత్రోచ్ఛారణ నడుమ ఫైల్ పై సంతకం చేసి కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.