విజయవాడ భవానిపురం కరెంట్ ఆఫీస్ వద్ద స్థానిక ప్రజలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సోమవారం ఉదయం భవానిపురం కరెంట్ ఆఫీస్ రోడ్ లో ఇల్లు తొలగింపు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. గత కొన్ని సంవత్సరాలుగా తాము ఇక్కడే ఉంటున్నామని చాలా కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఇల్లు పడగొడుతుందని స్థానిక ప్రజలు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనకు మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు. తమపై ఇలాంటి చర్యకు పాల్పడటం అమానుషమని బాధితులు మండిపడ్డారు తక్షణమే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు