అధికారుల అలసత్వంతోనే యూరియా కొరత ఏర్పడిందని ప్రజా పక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి ఆరోపించారు. ఆయన ఆదివారం సాయంత్రం ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు ముందుగానే చర్యలు తీసుకొని ఉంటే యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చేది కాదన్నారు. సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులు అందించినప్పుడే పంటల సాగు సక్రమంగా సాగుతుందన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారన్నారు