పెంచికల్పేట్ మండలంలో కోడిపందాల స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించి కోడిపుంజులను నగదు ను స్వాధీన పరుచుకొని ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఎస్సై అనిల్ కుమార్ తన సిబ్బందితో కలిసి దర్గపల్లిలో ఇద్దరు వ్యక్తులను 600 రూపాయల నగదు ఒక కోడిపుంజును స్వాధీన పరుచుకున్నారు. కొండపల్లి గ్రామంలో ఐదుగురు వ్యక్తులను మూడు కోడిపుంజులను 1720 రూపాయల నగదును స్వాధీనపరచుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు,