రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సెప్టెంబర్ మొదటి వారం లోపు పింఛన్లు పెంచాలని. లేనిపక్షంలో నైతిక బాధ్యత వహిస్తూ గద్దె దిగి ఇంటికి పోవాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొలువుదీరి 20 నెలలు దాటిన ఇంకా పింఛన్ దారులను మోసం చేస్తామంటే సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ హెచ్చరిస్తున్నామన్నారు. దివ్యాంగులు.. కాళ్లు లేనోళ్లు కళ్లులేనోళ్లు హైదరాబాద్ కు ఏం వస్తారులే అనుకుంటున్నారేమో.. సెప్టెంబర్ 9న మహా గర్జన సభ నిర్వహించి ప్రభుత్వ మోసాన్ని ఎండగడతామన్నారు.