Download Now Banner

This browser does not support the video element.

గజపతినగరం: పరిశుభ్రతలో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి: పెంట శ్రీరాంపురంలో జిల్లా పరిషత్ సీఈవో బి.వి.సత్యనారాయణ

Gajapathinagaram, Vizianagaram | Aug 22, 2025
గంట్యాడ మండలం పెంట శ్రీరాంపురం గ్రామంలో పారిశుద్ధ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్తను సేకరిస్తున్న తీరును శుక్రవారం ఉదయం జిల్లా పరిషత్ సీఈవో బివి సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ వేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఆయన పలు సూచనలు ఇచ్చారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు . గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితిని పరిశీలించి గ్రామ కార్యదర్శి కి పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఆర్ వి రమణమూర్తి గ్రామ కార్యదర్శి గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us