అర్బన్ ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ప్రొహిబిషన్ సంయుక్త ఆధ్వర్యంలో రాసనపల్లిలో దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ అర్బన్ సీఐ శ్రీహరి రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా పిల్లిగుట్ట, సర్దార్ మిట్ట, ఊటవంక ప్రాంతాలలో 2,500 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి మూడు కేసులు నమోదు చేశామన్నారు. త్వరలో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తామన్నారు.