కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వార్షిక కార్యాచరణ ప్రణాళిక పై సమన్వయ సమవేశం జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ అద్వర్యంలో బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అనుభంద శాఖల అధికారులు సమన్వయం తో కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. సన్నాహక దశలో జిల్లా, మండల స్థాయిలలో విభాగాల సమన్వయ సమావేశాలు జరుగుతాయి. ప్రచార దశలో ప్రతి గ్రామంలో సమావేశాలు, మోడల్ ప్రదర్శనలు నిర్వహించాలన్నారు.