మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం జాతీయ రహదారి 161 టోల్గేట్ వద్ద శుక్రవారం ఒక భయానక సంఘటన చోటుచేసుకుంది. గుజరాత్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఒక లారీ… డ్రైవర్ మద్యం మత్తులో అదుపుతప్పి వేగంగా దూసుకెళ్లింది. చివరికి లారీ డివైడర్ ను ఢీకొని బీభత్సం సృష్టించింది.ఘోర ప్రమాదం తప్పింది కానీ… అక్కడి ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు.