జామి మండలం సిరికిపాలెం పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందు మృతిచెందాడు. దీనితో ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 3 కు పెరిగింది. కొత్తవలస నుంచి అతివేగంగా వస్తున్న కారు సిరికిపాలెం సమీపంలో అదే రూట్ లో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనదారులను బలంగా ఢీకొట్టడంతో జామి మండలం సిరికి పాలని చెందిన బి.సాగర్ ఎల్ కోట మండలం భీమాలికి చెందిన గొలుపెల్లి నాయుడు లు అక్కడికక్కడే మృతిచెందిగా, బీమాలకు చెందిన మిడత సూర్య ప్రకాష్ కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.