చీపురుపల్లి లో వైకాపా కార్యకర్తలు అభిమానులు మద్య శుక్రవారం మద్యాహ్నం వైకాపా అభ్యర్ధి మంత్రి బొత్స సత్యనారాయణ కోలాహలం గా నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి కి తన నామినేషన్ పత్రాలను శుక్రవారం మద్యాహ్నం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో సారి రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి అధికారం రావడం ఖాయమని అన్నారు. సంక్షేమం అభివృద్ధే జగన్మోహన్ రెడ్డి ని రెండో సారి ముఖ్యమంత్రి ని చేస్తూందని అన్నారు.