అయినవిల్లిలో బుధవారం ఉదయం 10 గంటల సమయంలో భారీ వర్షం కురవడంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వినాయక చవితి మహోత్సవాలు ప్రారంభం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు. ఒక్కసారిగా భారీ వర్షం కురవడం కోసం భక్తులు తడిచి ముద్దయ్యారు.