ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరకులోయ పర్యటన కారణంగా, ప్రజల సౌకర్యం మరియు భద్రత కోసం అనంతగిరి ఘాట్ రోడ్పై భారీ వాహనాల యావత్ రద్దీని నివారించడం కోసం తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 3సాయంత్రం నుంచి 06 వ తేదీ ఉదయం 10:00 గంటల వరకు అమలులో ఉంటుందనీ ఎస్పీ ఆ ప్రకటనలో తెలిపారు.