ఎస్టీ జాబితా నుండి బంజారా, లంబాడి, సుగాలీలను తొలగించాలని సుప్రీంకోర్టులో వేసిన అక్రమ కేసును ఉపసంహరించుకోవాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భీమా సాహెబ్ ఆదివాసి గిరిజన నేతలకు హితవు పలికారు.మంగళవారం సాయంత్రం 4గంటలకు కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీ ముందు గిరిజన విద్యార్థుల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో భీమా సాహెబ్ మాట్లాడుతూ ఎస్టీ జాబితాలో లంబాడి,బంజారాలను ఆర్టికల్ 342 ప్రకారం రాజ్యాంగబద్ధంగానే చేర్చారని అన్నారు. అయిన కొందరు ఆదివాసి నేతలు తమ స్వార్ధ రాజకీయ ఉనికి కోసమే అక్రమ కేసులు వేస్తూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్న లంబాడి, ఆదివాసి సోదరుల మధ్య చిచ్చు పెడుతున్నారు.