సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా కోర్టుకి హాజరయ్యారు.సోమిరెడ్డి కుటుంబానికి విదేశాల్లో వెయ్యి కోట్లు ఆస్తులున్నాయని గతంలో కాకాని ఆరోపణలు చేశారు. అందుకు పత్రాలు సృష్టించారు. ఈ కేసులో తన పరువుకు భంగం కలిగిందని కాకాణిపై సోమిరెడ్డి పరువు నష్టం దావా వేశారు. అందులో విచారణకు ఆయన మంగళవారం హాజరు అయ్యారు. సెప్టెంబర్ 16కి న్యాయమూర్తి వాయిదా వేశారు.