కురుపాం మండలం మొండెంకళ్లో అక్రమంగా నాటుసార విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై నీలకంఠ రావు మాట్లాడుతూ సుమారు 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇకపై అక్రమంగా నాటు సారా తయారీ విక్రయాలు లేదా రవాణా చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.