గుత్తి శివారులోని గుంతకల్లు రోడ్డులో ప్రమాదవశాత్తు లారీ రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. మంగళవారం క్రెయిన్ సాయంతో లారీని తొలగించడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ట్రాఫిక్ జామ్ అయింది. అరగంట పాటైనా ఇంకా లారీని పక్కకు తొలగించలేదు. ట్రాఫిక్ క్లియర్ కాలేదు. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి తంటాలు పడుతున్నారు. అయినప్పటికీ ట్రాఫిక్ క్లియర్ కాలేదు. వాహనదారులు, జనాలు ఇబ్బందులు పడుతున్నారు.