తమ పై తీవ్రంగా దాడికి పాల్పడిన కేవిపల్లి ఎస్ఐ చిన్న రెడ్డప్ప పై చర్యలు తీసుకోవాలని కేవిపల్లి మండలం జిల్లేల్లమంద గ్రామ వాసి ఎర్రమాశి రుద్రయ్య నాయుడు మరియు గ్రామస్తులు మీడియా ముందు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా భాధితులు పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ పాత వడ్డిపల్లి, కరణం వారి పల్లి వినాయక చవితి వేడుకల సందర్భంగా ఇరువర్గాలు ఘర్షణ పడి పెద్ద మనుషుల సమక్షంలో సద్దుమణిగి తిరిగి వెల్తుండగా దారి మధ్యలో ఎస్ఐ చిన్న రెడ్డప్ప తమ పై చిన్న పెద్ద అనే తేడా లేకుండా విచక్షణ రహితంగా కొట్టాడని ఆరోపించారు.