ప్రజా ఫిర్యాదులను నిర్ణీత గడువు లోపల పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో సుమారు 80 మంది బాధితులు ఫిర్యాదులు సమర్పించారు. నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.