నరసరావుపేట లోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పర్యటించారు. వార్డుల్లో పర్యటిస్తున్న సమయంలో ఇస్త్రీ బండి దగ్గరకు వెళ్లి బట్టలను ఇస్త్రీ చేశారు. మున్సిపాలిటీని దేశంలోనే అత్యంత శుభ్రమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా సమిష్టి కృషితో పట్టణాన్ని శుభ్రంగా మార్చాలన్నారు.