ఎన్టీఆర్ జిల్లాలో ఎరువుల కొరత లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మిశ స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా పర్యటించి రైతులతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 4,500 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, ఇందులో సగానికి పైగా హోల్సేల్, రిటైలర్లకు పంపించామని చెప్పారు. మరో 2,500 టన్నుల యూరియా త్వరలో జిల్లాకు చేరుతుందని వెల్లడించారు. విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.