ప్రజలు యోగాను తమ దైనందిన జీవనం లో భాగంగా చేసుకోవాలని కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య సోమవారం పేర్కొన్నారు.యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద నుండి కలెక్టరేట్ నుండి రాజవిహార్ వరకు నిర్వహించిన మాస్ ర్యాలీని జాయింట్ కలెక్టర్, నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మూడు రంగుల బెలూన్లను గాలిలోకి వదిలి ర్యాలీని ప్రారంభించారుఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా గ్రామ, మండల, రెవెన్యూ డివిజన్ స్థాయిలో యోగా కార్యక్రమం పై అవగాహన కల్పిస్తూ రంగోలి, వ్యాసరచన, వకృత్వ, యోగా పోటీలతో