ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం మురికిమళ్ళ తండా వద్ద గేదెను ఢీ కొట్టి అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ సంఘటనలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఎర్రగొండపాలెం ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. గాయపడిన వారందరూ ఆర్ ఉమ్మడివరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు వైద్యులు వెల్లడించారు. కూలి పనుల నిమిత్తం వినుకొండకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు.