అహోబిలంలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు,ఆళ్లగడ్డ మండలం ప్రముఖ పుణ్య క్షేత్రమైన అహోబిలంలో శుక్రవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా వేద పండితులు విశేష పూజలు చేశారు. శ్రీ ఉత్సవమూర్తులు శ్రీ ప్రహ్లాద వరద స్వామి శ్రీదేవి భూదేవి మూర్తులకు జ్యేష్టాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ స్వామిని దర్శించుకున్నారు.