మహబూబాబాద్ పట్టణంలోని గాయత్రి గుట్ట సమీపంలో శుక్రవారం జాతీయ రహదారిపై కారులో రాంబాబు (28) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కురవి మండలం తాట్యా తండాకు చెందిన రాంబాబు మృతదేహాన్ని కారులో గుర్తించారు. కారులో రక్తపు మరకలు కనిపించడంతో ఇది హత్య, ఆత్మహత్య లేదా గుండెపోటుతో సంభవించిన మరణమా అనేది పోలీసుల విచారణలో తేలనుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.