సుదీర్ఘ కాలం పోలీసుశాఖలో బాధ్యతాయుతంగా, ఎంతో క్రమ శిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన హెూంగార్డులు కే.సూర్యనారాయణ, ఎం.వెంకట రామకృష్ణా రావు లను జిల్లా పోలీసుశాఖ తరుపున జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం మనంగా సత్కరించి "ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు విధులను ఎంతో సమర్ధవంతంగా నిర్వహించడం చాలా కష్టతరమన్నారు. అటువంటి విధులను నిర్వహించి, పోలీసుశాఖకు చేదోడు వాదోడుగా సుదీర్ఘ కాలం హెూంగార్డుగా సేవలందించడం అభినందనీయమన్నారు. క్లిష్ట పరిస్థితులు, విభిన్న వాతావరణంలో విధులు