ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కిసాన్ చౌక్ ప్రాంతంలో ఉన్న ఒక ఏటీఎంలో చోరీకి యత్నించిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. దొంగ గడ్డపారతో ఏటీఎం లాకర్ను పగులగొట్టడానికి ప్రయత్నించగా, అలారం మోగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో దొంగ పారిపోయాడు. రైల్వే స్టేషన్ ప్రాంతంలో అతన్ని పట్టుకున్నట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.