శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలంలోని పాలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆదివారం ఉదయం పర్యటించారు. కొండకింద తండాలో మరణించిన గౌతమీ బాయ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదించాలన్నారు. అనంతరం రెడ్డిపల్లి, సిక్కివారిపల్లి, కుటాలపల్లి, బసిరెడ్డిపల్లి, గంగాపురంలో అనారోగ్యంతో బాధపడుతున్న వైసీపీ నాయకులను పరామర్శించి, ఆర్థిక సాయం చేశారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.