అప్పులు చేయడంలో, అడుక్కు తినడంలో అటు వైకాపా ప్రభుత్వం , ఇటు టిడిపి కూటమి ప్రభుత్వం దొందు దొందే అని రాజ్యసభ మాజీ సభ్యులు ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం వేంపల్లి లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్వర్గీయ కొణిజేటి రోశయ్య గారు ఆర్థిక మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణను పాటించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి పోకుండా కాపాడినాయని తులసి రెడ్డి అన్నారు.