బంగారుపాళ్యం మండలం వెంకటాపురం (కుప్పాలపల్లి) సమీపంలోని నీటి కుంటలో గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్రవాహనంతో సహా మృతి చెందిన విషయం తెలిసిందే ప్రాథమిక దర్యాప్తులో మృతుడు ఐరాల మండలం పైపల్లి గ్రామానికి చెందిన ముస్తఫాగా గుర్తించారు. భార్యాభర్తల మధ్య కలహాల కారణంగా పైపల్లెలో నివసిస్తూ పాత సామాన్ల కొనుగోలు వ్యాపారం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నట్లు వెల్లడించారు.