ములుగు మున్సిపాలిటీ పరిధి లో నూతన భవనాలు నిర్మించుకోవాలనుకునే వారు లే అవుట్ అనుమతులు ఉన్న ప్లాట్లను కొనుగోలు చేసి భవనాలు నిర్ణయించుకోవాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ నేడు శుక్రవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు తెలిపారు. అనుమతి లేని లే అవుట్ భవనాల నిర్మాణానికి మున్సిపాలిటీ నుండి అనుమతి ఉండదని మరియు మున్సిపాలిటీ నుండి పొందే ఇతర సేవలు పొందలేరని, ఈ విషయంలో ములుగు మున్సిపాలిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు.