పలు జిల్లాల పరిధిలో చోరీలకు పాల్పడిన ముద్దాయిలను రాజోలు పోలీసులు అరెస్టు చేశారు. రాజోలు సీఐ నరేష్ కుమార్ శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం బి.సావరంకు చెందిన కట్టా అర్జున్, రాజమండ్రికి చెందిన షేక్ భాషి, కాకినాడకు చెందిన షేక్ అజీజ్, ఏలూరు జిల్లా గొల్లగూడెంకు చెందిన సోదేం మంగ ప్రసాద్ లపై పలు పోలీస్ స్టేషన్ లలో 10 చోరీ కేసులు ఉన్నాయన్నారు. వీరి నుండి రూ 11,58,500 విలువ గల ఆభరణాలను రికవరీ చేశామన్నారు.