రాయదుర్గం పట్టణంలోని నిమజ్జన వేడుకలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం సాయంత్రం నుంచి పట్టణంలోని వివిధ కాలనీల్లో వెలసిన గణనాథులు మూడవరోజు నిమజ్జనానికి ఊరేగింపుగా తరలారు. నాన్ చెరువు వద్ద నిమజ్జనానికి అధికారులు ఏర్పాటు చేశారు. యువకులు, మహిళలు, చిన్నారుల కోలాహలం మద్య ట్రాక్టర్ల మీద ఊరేగింపుగా గణేషుడి విగ్రహాలను తరలించారు. చెరువు నీటిలో నిమజ్జనం చేసి గణేషుడికి వీడ్కోలు పలికారు. నేటి రాత్రి 10 గంటల వరకు కూడా వినాయక విగ్రహాలు ఈ ప్రాంతానికి తరలిరానున్నాయి. మున్సిపల్, పోలీసులు, రెవెన్యూ, విద్యుత్ అధికారులు దగ్గర ఉండి నిమజ్జనం సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు.