నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం లోని యూరియా కొరతకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు తిప్పర్తిలోని ప్రధాన రహదారిపై బైఠాయించి శుక్రవారం ధర్నా నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది .పోలీసులు జోక్యం చేసుకొని రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. తమ సమస్య పరిష్కారానికి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున రైతులు డిమాండ్ చేశారు.