నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న పార్వతీపురం వాసులు ఖాట్మండు నుండి విశాఖపట్నం కి ఫ్లైట్లో గురువారం బయలుదేరినట్లు తెలిపారు. పార్వతీపురానికి చెందిన పొట్నూరు శ్రీనివాసరావు దంపతులతో పాటు మరి కొంతమంది ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తులు నేపాల్ విహారయాత్రకు వెళ్లారు. ఇటీవల నేపాల్ లో జరుగుతున్న అల్లర్లలో చిక్కుకున్నారు. ప్రభుత్వ సర్వతో వారు గురువారం ఖాట్మండు నుండి విశాఖ ఫ్లైట్లో బయలుదేరినట్లు తెలిపారు.