తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఎన్నికల హామీలు నేరవేర్చిన ఘనత చంద్రబాబు కే సాధ్యమైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి లోని సుధా కళ్యాణ మండపంలో టీడీపీ రాజంపేట పార్లమెంటు స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలతో పాటు మరిన్ని పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు