తిరువూరు నియోజకవర్గం గంపలగూడెంలో అన్నదాత పోరుబాట కార్యక్రమానికి వెళుతున్న వైసీపీ శ్రేణులను మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. అన్నదాత పోరుబాట కార్యక్రమానికి ప్రభుత్వం నుండి అనుమతి లేదని సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్ఐ శ్రీనివాస్ హెచ్చరించారు.