జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నెల్లికుదురు మండలంలోని నెల్లికుదురు,మదనతుర్తి,ఎర్రబెల్లి గూడెం వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో నిర్వహిస్తున్న రిజిస్టర్లను తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని,కొనుగోలు కేంద్రాలలో సరిపడ గన్ని బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన ప్రకారం రైతుల నుండి ధాన్యం సేకరించడం జరుగుతుందని,రైతులు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు.