చింతపల్లి మండలం అన్నవరం పోలీసుల వాహనాల తనిఖీల్లో రూ ఆరు లక్షల విలువైన 105 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చింతపల్లి సీఐ వినోద్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.చింతపల్లి సీఐ ఎం.వినోద్ బాబు, ఎస్సై అన్నవరం జి.వీరబాబు కి వచ్చిన సమాచారం మేరకు సోమవారం మధ్యాహ్నం సీఐ వినోద్ బాబు ఆధ్వర్యం లో ఎస్సై వీరబాబు మరియు సిబ్బంది కలిసి ఒరిస్సా రాళ్లగడ్డ నుండి లోతుగడ్డ బ్రిడ్జి వైపుకు అనుమాన స్పదంగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా మూడు గోని సంచల్లో 105 కేజీల గంజాయి పట్టుబడినట్లు సిఐ వినోద్ బాబు తెలిపారు