గుత్తి మండలం ఊబిచెర్ల గ్రామ శివారులో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన 5G నెట్వర్క్ టవర్ ఉంది. దొంగలు బుధవారం రాత్రి టవర్కు ఏర్పాటు చేసిన సుమారు 300 మీటర్ల కోర్ కేబుల్ వైర్లను కట్ చేసి ఎత్తుకెళ్లారు. సుమారు 70 వేల రూపాయలు నష్టం వాటిలినట్లు నెట్వర్క్ సెల్ టవర్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఘటనపై నెట్వర్క్ కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.