రాజోలు నియోజకవర్గం వ్యాప్తంగా పలు ప్రాంతాలలో మంగళవారం ఉదయం నుంచి మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలను వైయస్సార్సీపి శ్రేణులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంకలో వరదనీటిలోనే వైయస్సార్ చిత్రపటానికి వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.