కర్నూలు ప్రెస్‌క్లబ్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కొత్తూరు సత్యనారాయణ గుప్తా తెలిపారు. శనివారం ప్రెస్‌క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.సభ్యత్వం ఎప్పుడు ప్రారంభమవుతుందో అనేక మంది పాత్రికేయ మిత్రులు అడుగుతున్న నేపథ్యంలో సోమవారం సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు తెలిపారు. రూ.500 చెల్లించి పాత్రికేయ మిత్రులు సభ్యత్వం పొందవచ్చని చెప్పారు.మొదటగా అక్రిడిటేషన్ కలిగిన పాత్రికేయులకు సభ్యత్వం కల్పిస్తామని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలోని ప్రతి మండల స్థాయి మీడియా ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు