మధురవాడలో ఒక ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన మంగళవారం జరగగా గురువారం వెలుగులోకి వచ్చి విద్యార్థి కుటుంభ సభ్యులు పాఠశాల ఆవరణలో ఆందోళన నిర్వహిస్తున్నారు. గాయపడిన విద్యార్థికి చేయి విరిగి మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గాయపరిచిన టీచర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. పాఠశాల యాజమాన్యం స్పందించి విద్యార్థికి న్యాయం చేయాలని కోరుతున్నారు.