శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం లో ఇటీవల పట్టుబడిన ఉగ్రవాది నూర్ మహమ్మద్ ను రెండు రోజులు జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారణ అనంతరం శుక్రవారం సాయంత్రం పుట్టపర్తి జ్యుడీషియల్ కోర్టులో హాజరుపరిచారు.జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ జడ్జి ముజీబ్ పసపల సయ్యద్ నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించారు. రెండు రోజుల కస్టడీకి సంబంధించిన విషయాలను పోలీస్ అధికారులు గోప్యంగా ఉంచారు. ఉగ్రవాది కి ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అతని మూలాలు ఏంటి , అతని వద్ద స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ లో ఉన్న సమాచారం ఆధారంగా కీలక విషయాలు రాబట్టేందుకు పోలీసులు మరోసారి అతన్ని కస్టడీ కోరనున్నారు.