నవోదయం 2.0 కార్యక్రమం క్రింద నాటు సారా వల్ల కలిగే దుష్ప్రభావాలను సంపూర్ణ అవగాహన కల్పించి అన్నమయ్య జిల్లాను నాటు సారా రహిత జిల్లాగా ఏకగ్రీవంగా ఆమోదించామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, జిల్లాస్థాయి కమిటీ సభ్యులతో కలిసి అన్నమయ్య జిల్లాను నాటు సారా రహిత జిల్లాగా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జయరాజు, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, సూపర్డెంట్ జి. మధుసూదన్, ఏఈఎస్ జోగేంద్ర