సమాజంలోనూ చదువుతూనే ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంటుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బనగానపల్లె మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి పేర్కొన్నారు. బుధవారం బనగానపల్లె మండలం నందివర్గంలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన సామూహిక అక్షరాస్యత కార్యక్రమంలో రాజారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంపూర్ణ అక్షరాస్యతతోనే సమాజంలో అసమానతలు తొలగిపోతాయని రాజారెడ్డి అన్నారు.