మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేటలో గిరిజనులు ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేశారు. మండలంలోని లింగాపూర్ ఫారెస్ట్ బీట్ లో ఇటీవల పోడు సాగుకోసం చెట్లు నరికిన గిరిజనులను సరేండర్ చేయడానికి శుక్రవారం సాయంత్రం దమ్మన్నపేటకు ఫారెస్ట్ సిబ్బంది వెళ్లారు. గిరిజనులు తిరగబడి కళ్ళలో కారంపొడి చల్లి దాడి చేసినట్లు సమాచారం.